శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేయడమైనది. దీంతో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గల ఈ-దర్శన్ కౌంటర్‌లో అక్టోబర్ 7న ఆదివారం దర్శన టోకెన్లు ఇవ్వబడవు.
ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. దర్శనం రద్దు విషయాన్ని స్థానిక భక్తులు గమనించి సహకరించాలని టిటిడి కోరుతోంది.
Source