అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు ఉపమాక వార్షిక బ్రహ్మోత్సవాలు

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం, ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబరు 9వ తేదీన ఉదయం 10.30 గంటలకు తిరువీధిలో ”బ్రహ్మోత్సవ కావిడి” త్రిప్పుటతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. రాత్రి చిన్న పల్లకీ ఉత్సవం, అశ్వవాహనంపై స్వామివారు విహరించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు



  • 10-10-2018 వ తేదీ  ఉదయం పెద్ద పల్లకీ ఉత్సవం, సాయంత్రం రాజధిరాజ సేవ

  • 11-10-2018 వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం ఇత్తడిసప్పరం

  • 12-10-2018 వ తేదీ ఉదయం పెద్ద పల్లకీ ఉత్సవం, సాయంత్రం హంస వాహనం

  • 13-10-2018 వ తేదీ ఉదయం రాజధిరాజ, సాయంత్రం పెద్ద పల్లకీ

  • 14-10-2018  వ తేదీ ఉదయం హంస వాహనం, సాయంత్రం ఇత్తడి సప్పరం

  • 15-10-2018 వ తేదీ ఉదయం వసంతోత్సవం, సాయంత్రం గరుడవాహనం

  • 16-10-2018 వ తేదీ ఉదయం రథోత్సవం, సాయంత్రం పుణ్యకోటి

  • 17-10-2018 వ తేదీ ఉదయం మృగవేట, సాయంత్రం గజవాహనం

  • 18-10-2018 వ తేదీ ఉదయం వినోదోత్సవం, సాయంత్రం పల్లకీ ఉత్సవం


అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు శ్రీ చక్ర పెరుమాళ్‌ చిన్న పల్లకిలో తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Source