శ్రీవారి భక్తితత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి : శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తితత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి అనుగ్రహభాషణం చేశారు. టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో మంగళవారం ఉదయం 3వ నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవాన్నికి విచ్చేసిన 220 మంది వేద పండితులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి అనుగ్రహభాషణం చేస్తూ భగవత్‌ రామానుజాచార్యులు నిర్ధేశించిన విధంగా తిరుమలలో శ్రీవారి కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను క్రమబద్ధంగా పారాయణం చేస్తూ, భక్తులలోనికి తీసుకువేళ్ళాలన్నారు. అంతకుముందు శ్రీచిన్నజీయర్‌స్వామికి పూర్ణకుంభం స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి చిత్రపట్టానికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, డిల్లీ రాష్ట్రాల నుండి విచ్చేసిన దివ్య ప్రబంధ పారాయణదారులు పాశురాలను పారాయణం చేశారు.

కాగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పారాయణదారులు దివ్య ప్రబంధ గోష్ఠిగానం నిర్వహించారు.

Source