అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు అప్పలాయగుంటలో పవిత్రోత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 4న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

అక్టోబరు 5న ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం, యాగశాల కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. అక్టోబరు 6న ఉదయం యాగశాల కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ చేపడతారు. అక్టోబరు 7న పూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

Source