టిటిడికి చెందిన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. గోపూజ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, ఉదయం 6 నుండి 9 గంటల వరకు వేణుగానం, ఉదయం 6.30 నుండి 8 గంటల వరకూ ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం , ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటం, ఉదయం 8 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమాలు జరిగాయి.
ఉదయం 10.30 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజ, హారతి సమర్పించారు. సాంస్కృ తిక కార్యక్రమాల అనంతరం ప్రసాదం పంపిణీ చేసారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులతో హరికథ వినిపిస్తారు. ఈ సందర్భంగా పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పించింది.
Source