తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా ఆదివారం తిరుమలకు తీసుకొచ్చింది. తిరుమలకు చేరుకున్న గొడుగులకు టిటిడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.

గ‌త 14 సంవ‌త్స‌రాలుగా బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో హిందూ ధర్మార్థ సమితి ద్వారా శ్రీ‌వారికి గొడుగుల‌ను విరాళంగా అందిస్తున్నార‌ు.

మొత్తం 11 గొడుగులను తీసుకురాగా సెప్టెంబ‌రు 15న శ‌నివారం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారికి రెండు గొడుగులు సమర్పించారు. మిగిలిన తొమ్మిది గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయంలో అందజేశారు.

Source