అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల గుండా ఊరేగింపుగా గోదాదేవిమాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
గోదాదేవి మాలల ప్రత్యేకత
శ్రీవిల్లిపుత్తూరు లోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించడం జరిగింది. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారము.
Source