శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 338వ ఆరాధోనత్సవాలు కర్నూలు జిల్లా మంత్రాలయంలో బుధవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి.
ఉత్సవాల తొలిరోజైన బుధవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో పీఠాధిపతి సుయతీంద్ర తీర్థ స్వామి చేతుల మీదుగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.
రాత్రి 8.30 గంటలకు ప్రహ్లాదరాయలను రథంపై ఊరేగించి, ఆ తర్వాత 9.15 గంటలకు ఊంజల్‌సేవ, పది గంటలకు బృందావనానికి మహా మంగళహారతి నిర్వహిస్తారు.
వేలాది మంది భక్తులు తరలి వచ్చే ఈ ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మఠంముఖద్వారం, ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.