తిరుమల సమాచారం: అణివార ఆస్థానం లో శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలతో సారెను తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ  సమర్పించింది.

మంగళవారం ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకువెళ్ళారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ప్రతి ఏడాది ఆణివార ఆస్థానం పర్వదినాన శ్రీరంగం శ్రీరంగనాధుడి చెంత నుండి తిరుమల శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ప్రతి ఏడాది కైశిక ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారి చెంత నుండి శ్రీరంగంలోని శ్రీరంగనాధస్వామివారికి కానుకగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

Source