చాతుర్మాసం చేయటానికి అందరూ అర్హులే...
చాతుర్మాస్య వ్రతాన్ని వితంతువులైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని హిందువుల తోపాటు జైన, బౌద్ధ మతస్థులు వారి వారి ప్రాంతాల్లో కూడా ఆచరించడం కనిపిస్తుంది. ఈ వ్రతాచరణ ముఖ్య ఉద్దేశ్యం ఆచరించే వారి కుటుంబ, వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు, సమాజ శ్రేయస్సు కూడా ఇతోదికంగా ముడిపడి ఉంటుంది. ఆషాఢం నుంచి నాలుగు నెలలు వర్షాలు బాగా పడు తుంటాయి. ఇలాంటి తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అనువుగా ఉంటుంది. చాతుర్మాస్య వ్రతంలో పాటించే ఆహార, విహారాది నియమాల ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.
చాతుర్మాసం అంటే ఒక్కో ఋతువుకు ఒక్కో యజ్ఞం..
చాతుర్మాస్య వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగయుగాలుగా ఆచరణలో ఉందని మన పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఒకప్పుడు నాలుగు నెలలపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలలపాటు ఉండే ఆరు రుతువులుగా మారాయి. తొలినాళ్లలో వర్ష, హేమంత, వసంత అనే మూడు రుతువులు మాత్రమే ఉండేవి. వర్ష రుతువుతోనే సంవత్సరం ఆరంభమవుతూ ఉండేది. ఈ కారణం వల్లే సంవత్సరానికి 'వర్షం' అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు రుతువులున్న ఆ కాలంలో ఒక్కో ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాడ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేద యజ్ఞం, ఫాల్గుణం నుంచి వైశ్వ దేవయజ్ఞం చేస్తూ ఉండేవారు.
చాతుర్మాసం....నాటి ఆషాడ యజ్ఞం ...
చాతుర్మాస్య వ్రతాన్ని పూర్వం ఆషాడంలో యజ్ఞంగా చేసేవారు. తర్వాత కాలంలో చాతుర్మాస్య వ్రతంగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియమాల్లో భాగంగా శ్రావణ మాసంలో ఆకు కూరలను, బాధ్రపద మాసంలో పెరుగును అశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి. వాటిని ఏమాత్రం ఆహారంగా తీసుకోకూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చు. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస వ్రతదీక్ష అనేది మాన వాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని తెలుస్తోంది.
చాతుర్మాసం లో ఆ నాలుగు ఏకాదశులు...
చాతుర్మాస దీక్ష చేపట్టినవారికి ఆషాఢ, శ్రావణ, భాద్రపద, అశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. ఈ నాలుగు నెలలు సాధకులు భూశయనం చేయడం, ఆకు కూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాట, ఆవ నూనెల సేవనం మానివేయడం, నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపడం, రోజూ ఒకే పూట భోజనం చేయడం, ఏకాదశుల్లో పూర్తిగా ఉపవాస దీక్ష చేయడం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. ఈ చాతుర్మాస నియమాను సారం చేసే సాధన వల్ల సాధకులకు శారీరక, ఆధ్మాత్మిక మేలు అపారంగా జరుగుతుంది. నాలుక విపరీతంగా రుచులను కోరుకుంటుంది. నాలుక ఎంతగా రుచులను కోరుకుంటుందో మనసు అంతలా చంచలమైపోతుంది.
మనసును ఎప్పుడైతే అచంచలం చేయగలుగుతామో అప్పుడు దైవ ధ్యానం అద్భుతంగా చేయగలుగుతాం. ఆ చంచల త్వాన్ని తగ్గించడం కోసం చాతుర్మాసంలో ఒక్కపూట భోజనం చేయాల్సి ఉంటుంది. ఈ నియమాలు పీఠాధిపతులు చేయవలసిన అవసరం ఏంటి? అంటే లోకం లో జ్ఞానులైన వారినే సాధారణ జనం అనుసరిస్తారు. కనుక సామాన్య జనాన్ని ఉద్ధరించాలనే ఏకైక లక్ష్యంతో, ప్రేమతో సాధు సంతులు, పీఠాధిపతులు నిష్కల్మషంగా చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
చాతుర్మాసం వ్రత దీక్షా లక్ష్యం ఒక్కటే...
చాతుర్మాస వ్రత దీక్షా సాధకుడు ఈ నాలుగు నెలలు సరిగ్గా వ్రత నియమాలను ఆచరిస్తే పంచభూతాత్మకమైన మానవ శరీరం శుద్ధి అవుతుంది. మన ఋషుల వాక్కులు అమత వాక్కులు. అవి మానవోద్ధరణకు సూచించిన మార్గదర్శకాలు. చాతుర్మాసంలో చేసే ఈ వ్రతం మళ్లీ చాతుర్మాసం వచ్చేవరకూ కావలసిన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆధ్మాత్మికంగా ముందుకు వెళ్లగలుగుతాం. ఆరోగ్యం, ఆధ్మాత్మికం రెండూ ఒకే పెట్టున గాడిలో పడడానికి ఈ వ్రతం మనకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ నాలుగు నెలలు చేసే ఈ సాధన మన జీవితాల్లో పరిపక్వతను తీసుకువస్తుంది ఱ