అన్నవరం లో మహోత్సవాలు ఇలా...
- 12న స్వామివారి మూలవిరాట్టుకు మఖనక్షత్ర పంచామృతాభిషేకం
- 13న తెల్లవారుజామున మహన్యాసపూర్వక పంచామృతాభిషేకం, సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకీసేవ, 7.30 గంటల నుంచి దర్బాసుసేవ, పంచహారతులు
అన్నవరం ఉత్సవాల్లో ప్రత్యేక పుష్పాలంకరణ
అన్నవరం సత్యనారాయణస్వామికి ఫలపుష్ప సేవను వైభవోపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం స్వామివారి నిత్య కళ్యాణమంటపాన్ని అన్ని హంగులతో సిద్ధంచేస్తారు. దీంతోపాటు రత్నగిరిపై నిర్మిస్తున్న యాగశాలను ఆగస్టు 12వ తేదీన ప్రారంభించనున్నారు.