https://www.youtube.com/watch?v=MhRNxYOYGGc
వరలక్ష్మీదేవి పాట
పల్లవి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చేవమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
చరణం1
పసి బాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
కాలి అందియలు ఘల్లున మ్రోవ కలహంస నడకలతో రామ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందుమ్మా
చరణం2
వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండు తల్లి
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కల్గి
ఆయుర్ వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చెే తల్లి
ఆయుర్ వృద్ది అష్టైశ్వర్యము ఐదవతనము లిచ్చే తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
చరణం3
నవరత్నాలు నీ నగుమోమే తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాశుల కళ్యాణి
కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మి
శ్రావణపూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా