శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయంలో జూలై 24 నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాల కు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఇందులోభాగంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, వాస్తుశాంతి, మృత్సంగ్రహణం చేపట్టారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి ఉత్సవర్లకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం నిర్వహించారు. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు గ్రంధి పవిత్ర సమర్పణ, మూడో రోజు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.

ఈ పవిత్రోత్సవాన్ని ఆర్జితం సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గ హస్థులు పాల్గొనవచ్చు. ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరి రోజు పవిత్రమాల బహుమానంగా అందజేస్తారు.

Source