తిరుమలలో సోమవారంనాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టిటిడి పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.
అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
Source