చంద్రగ్రహణం కారణంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాలను మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయాల తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 5 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
చంద్రగ్రహణం కారణంగా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను సాయంత్రం 5 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయాల తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 5 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలో అన్నప్రసాద వితరణ కేంద్రాల మూత
చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ సాయంత్రం 3 గంటలకు తిరుపతిలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, 2వ సత్రాలు, ఆసుపత్రులు, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్, టిటిడి పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్లో అన్నప్రసాద వితరణ ఉండదు. జూలై 28వ తేదీ ఉదయం నుండి యథావిధిగా అన్నప్రసాద వితరణ ఉంటుంది.
Source