సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మూెత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

సాలకట్ల బ్రహ్మూెత్సవాలు



  •  సెప్టెంబరు 17న గరుడవాహనం,

  • సెప్టెంబరు 18న స్వర్ణరథం,

  • సెప్టెంబరు 20న రథోత్సవం,

  • సెప్టెంబరు 21న చక్రస్నానం,  ధ్వజావరోహణం


 నవరాత్రి బ్రహ్మూెత్సవాలు



  • అక్టోబరు 14న గరుడవాహనం,

  • అక్టోబరు 17న స్వర్ణరథం,

  • అక్టోబరు 18న చక్రస్నానం


శ్రీవారి వాహనసేవలలో మార్పు


ఈ ఏడాది నుండి భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజు సాయంత్రం వాహనసేవలను రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు నిర్వహిస్తున్నారు.  గరుడసేవ రోజున మాత్రం రాత్రి 7.00 నుండి అర్ధ్రరాత్రి 12.00 గంటల వరకు నిర్వహిస్తారు.

గరుడసేవనాడు ద్విచక్రవాహనాలు నిషేధం


గరుడసేవనాడు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనుమ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేశారు. తిరుమలలో వివిధ ప్రాంతాలలో 6,800 కార్ల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. బందోబస్తు, గ్యాలరీల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర ద్వారాలు, అన్నప్రసాదాలు, జలప్రసాదం, రవాణా, వైద్య సౌకర్యాలు, అదనపు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

బ్రహ్మూెత్సవాలకు నూతన ఆర్‌టిసి బస్సులు


ఈ ఏడాది బ్రహ్మూెత్సవాల సందర్భంగా 165 క్రొత్త బస్సులను ఆర్‌టిసివారు ఏర్పాటు చేస్తున్నారు. గరుడసేవనాడు భక్తులను చేరవేసేందుకు 6500 ట్రిప్పులు తిరిగేలా టీటీడీ ఏర్పట్లు చేసింది. బ్రహ్మూెత్సవాలలో భక్తులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచడానికి చర్యలు చేపట్టింది.

శ్రీవారిసేవకులతో భక్తులకు అన్నప్రసాదాలు పంపీణి


శ్రీవారి వాహనసేవలు వీక్షించే భక్తులకు గ్యాలరీలో అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ, ఇతర సేవలను అందించేందుకు 3 వేల మంది శ్రీవారిసేవకులు, భక్తుల క్రమబద్దీకరణకు 1300 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలు అందిస్తారు. తిరుపతిలో భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్‌, తాగునీరు, రవాణా, ట్రాఫిక్‌ ఏర్పాట్లు ,టిటిడి విజిలెన్స్‌ విభాగం ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో భక్తులకు కట్టు దిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేస్తున్నారు.

వాహనసేవలలో 10 రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు


బ్రహ్మూెత్సవాలలో శ్రీవారి వాహనసేవలలో ప్రత్యేక ఆకర్షణగా దాదాపు 10 రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. అదేవిధంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు శ్రీవారి సేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడవీధులలో 19 ఎల్‌ఈడి స్క్రీన్‌లు, తిరుమలలోని ప్రధాన కూడళ్ళలలో 12 ఎల్‌ఈడి స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

గరుడసేవనాడు బ్రేక్‌ దర్శనాలు రద్దు


బ్రహ్మూెత్నవాల సమయంలో ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయి. సెప్టెంబరు 17 మరియు అక్టోబరు 14వ తేదీలలో గరుడసేవనాడు బ్రేక్‌ దర్శనాలు టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. అదేవిధంగా రెండు బ్రహ్మూెత్నవాలలో వయో వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టిటిడి రద్దు చేసింది.

Source