ఆరాధనోత్సవాలు -మఠాధిపతుల మంగళాశాసనాలు
శ్రీ జయతీర్థులవారు తన సాహిత్యం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు విశేషంగా కృషి చేశారని ఉడిపిలోని కాణ్యూర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యావల్లభతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యావల్లభతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ జయతీర్థుల వారి సాహిత్యాన్ని శ్రీ పురందరదాసులవారు గ్రహించి అపారమైన సంకీర్తనలు రచించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని, కష్టకాలంలో ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు. భక్తిమార్గంతోనే మానవులకు మనశ్శాంతి చేకూరుతుందన్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ప్రసన్నమూర్తి అయిన శ్రీవారిని సేవిస్తే శాంతస్వభావం అలవడుతుందని వివరించారు.
ఆరాధనోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతం, ధ్యానం, శ్రీజయతీర్ధుల సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం సామూహిక సంకీర్తనాలాపన, సంగీత విభావరి చేపట్టారు.
ఆరాధనోత్సవాలు-రెండవరోజు
శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం కళాకారుల సంకీర్తనాలాపన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి బెంగళూరులోని శ్రీరాఘవేంద్ర మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ, ఉడిపిలోని తీర్థహళ్లి భీమసేతు మునివృంద మఠాధిపతి శ్రీశ్రీశ్రీ రఘువరేంద్రతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ శ్రీ జయతీర్థులు మానవాళికి అందించిన సందేశాన్ని వివరించారు. శ్రీజయతీర్థులు సంస్కృతంలో గ్రంథరచన చేయగా, శ్రీ పురందరదాసులు కన్నడలోకి అనువదించి సంకీర్తనలు రచించారని తెలిపారు. మానవాళి కామక్రోధాలను అదుపులో ఉంచుకుని మానవత్వాన్ని పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సద్బుద్ధి, జ్ఞానం పెంచుకుని లోకకల్యాణం కోసం పాటుపడాలన్నారు.
ఆరాధనోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతం, ధ్యానం, శ్రీజయతీర్ధుల సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం సామూహిక సంకీర్తనాలాపన, సంగీత విభావరి చేపట్టారు.
టిటిడి దాససాహిత్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మూడు వేల మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
Source