దూర్వాగణపతి వ్రతం 2018-గరికతో గణపతిని...ప్రసన్నం చేసుకోండి

దూర్వాగణపతి వ్రతం ఎందుకు చేయాలంటే  విఘ్నేశ్వరురుడు విఘ్నాలకు అధిపతి. ఆయనను స్మరించనిదే మనం ఏ కార్యమూ తలపెట్టం. అందుకు పెద్ద పండుగలను మనం వినాయక చవితితో ఆరంభించుకుంటాం. ఏ పనినైనా తలపెట్టేముందు. విఘ్నాధిపతిని పూజిస్తే ఆ సంవత్సరం అంతా మనం చేపట్టే పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని మన నమ్మకం. అలాంటిది వినాయకునికి ప్రీతి పాత్రమైన పూజా ద్రవ్యాలతో ఆయనను పూజిస్తే మరి ఆయన కరుణా కటాక్షాలు మనపై ప్రసరించవా మరి.

వినాయకుని పూజించేందుకు వినియోగించే ఇరవై ఒక్క రకాల పత్రాలలోను ''గరిక (గడ్డి)'' అంటే అంటే విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం. శ్రావణ శుద్ధ తదియ నాడు  దూర్వాగణపతి వ్రతం చేసుకుంటే అన్నీ శుభాలే కలుగుతాయి.

దూర్వాగణపతి వ్రతంవెనుక కధ ఇదీ ...


దూర్వాగణపతి అని ఎందుకు పిలుస్తామంటే...  దూర్వం అంటే గరిక. గణపతికి గరిక అంటే ఇష్టం గనుక ఆ స్వామిని దూర్వాగణపతి అని కూడా  పిలుస్తాం. యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు. ఈయన అగ్ని సంబంధమైన తేజస్సు తో జన్మించాడు. అందువల్ల ఆయన శరీరము నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి. అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్ధిచాడు. గణపతి అనలాసురుని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు.

అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడంవల్ల విఘ్నేశ్వరుని ఉదరములో అమితమైన వేడి పుట్టింది. దాంతో ఆయన బొజ్జలో వివరీతమైన తాపము పుట్టింది. దేవతలు ఆయన భాదను చూడలేక నీటితోను, అమృతం తోను ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది. తరుణోపాయం కోసం ఈశ్వరుని ప్రార్ధించగా.... అప్పుడు పరమేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని సూచిస్తాడు. సంస్కృతములో గరికను ''దూర్వలం'' అంటారు . శివుడు ఆనతిచ్చిన ప్రకారం దేవతలంతా ఆ గణనాధుని జంటగరికపోచలతో ఆయనకు పూజలు నిర్వర్తించారు. దీంతో గణపతి తాపము వెంటనే చల్లారిపోయింది . అందుకే ఆ గణపతికి అన్ని పత్రాలకంటే గరికపోచలంటే ఎక్కువ ప్రీతి అన్నమాట.

దూర్వాగణపతి వ్రతం ఇలా చేసుకోండి...


దూర్వాగణపతి వ్రతం లో భాగంగా రెండుపోచల గరిక (గడ్డి) పత్రాలు సేకరించి వాటిని భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరునికి  సమర్పించాలి. శ్రావణ శుద్ధ తదియ రోజున అనగా ఆగస్టు 14న దూర్వా గణపతి వ్రతం చసుకోవాలి. ముందుగా ప్రతీ పూజలో వలెనే పసుపు గణపతి పూజ చేసి, అనంతరం గణపతి స్వామిని షోడశోపచారాలతో పూజించాలి. తరువాత జంటగరిక పోచలను ఈ క్రింది 21 నామాలతో పూజించి, 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి.  దూర్వా గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సుఖసౌఖ్యాలు.. శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

  • ఓం గజాననాయ నమః

  • ఓం గణపతయే నమః

  • ఓం హేరంబాయ నమః

  • ఓం ధరణీ ధరాయ నమః

  • ఓం మహా గణపతయా నమః

  • ఓం సర్వసిద్ది ప్రదాయ నమః

  • ఓం క్షిప్రప్రసాదనాయ నమః

  • ఓం అమోఘ సిద్దియే నమః

  • ఓం అమితాయ నమః

  • ఓం మంత్రాయ నమః

  • ఓం చింతామణయే నమః

  • ఓం నిధయే నమః

  • ఓం సుమంగళాయ నమః

  • ఓం బీజాయ నమః

  • ఓం ఆశాపూరకాయ నమః

  • ఓం వరదాయ నమః

  • ఓం శివాయ నమః

  • ఓం శాక్యపాయ నమః

  • ఓం పార్వతీనందాయ నమః

  • ఓం వాక్యతయే నమః

  • ఓం ఢుంఢి వినాయకాయ నమః