ఆషాడ మాసం 2018: ఆషాఢ శుద్ధ దశమి నాడు మహాలక్షిని ఆరాధించాలి

ఆషాఢ శుద్ధ దశమి శాకవ్రత మహాలక్ష్మీ వ్రతారంభ దినం. ఈనాడు మహాలక్ష్మిని పూజించి, ఒక నెల ఆకు కూరలు తినడం మాని, ఆకు కూరలు దానం చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఆషాఢంలో వచ్చే పర్వాలలో శాకంబరి ఉత్సవం కూడా ముఖ్యమైనదే. పల్లెలు, పట్టణాల్లో ఈనాడు అమ్మవార్లను కూరగాయలు, ఆకు కూరలతో అలంకరిస్తారు.

ఆషాఢ శుద్ధ దశమి నాడు శాకాంబరిగా అమ్మవారు


ఆషాఢ శుద్ధ దశమి నాడు సంపదల తల్లి అయిన మహాలక్ష్మిని షోడశోపచారాలు, అష్టోత్తరాలు, శ్రీసూక్తసహితంగా పూజించి ఆకుకూరల్ని నివేదిస్తారు. ఆషాఢంలో అమ్మవారి వివిధ స్వరూపాల్ని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, సస్యాలు వంటి ఆహార ద్రవ్యాలతో అలంకరించి శాకంబరిగా ఆరాధించడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. అలాగే, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుషమన్వంత రాది దినం కూడా. చాక్షుష మనువు మనువుల్లో ఆరవ వాడు.