తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఉడిపి శ్రీ పెజావర్‌ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ

కర్నాటకలోని ఉడిపిలో ప్రసిద్ధి చెందిన శ్రీ పెజావర్‌ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ మంగళవారం ఉదయం కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శిష్యబృందంతో దర్శించుకున్నారు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన శ్రీమధ్వాచార్యులు స్థాపించిన అష్టమఠాల్లో శ్రీ పెజావర్‌ మఠం ఒకటి. ప్రస్తుతం 32వ పీఠాధిపతిగా శ్రీవిశ్వేశతీర్థస్వామీజీ కొనసాగుతున్నారు.

ఆయనకు టిటిడి అధికారులు, అర్చకస్వాములు వారికి ఆలయమర్యాదలతో ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అక్కడ నుంచి శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు.

ఉడిపి పెజావర్‌ మఠం తరుపున శ్రీమలయప్పస్వామివారికి సుమారు 300 గ్రాముల బంగారంతో బంగారు పాదాలను బహూకరించారు. అనంతరం శ్రీ విశ్వేశ తీర్థ స్వామిజీ తిరుమలలోని ఉడిపి మఠానికి చేరుకున్నారు.

Source