టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరిమాణిక్యస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి అధికారులు ఆవిష్కరించారు.
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు మే 27 నుండి జూన్ 4వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా మే 27న ధ్వజారోహణం, మే 31న న గరుడసేవ, జూన్ 3న ఉదయం రథోత్సవం, రాత్రి కల్యాణోత్సవం, జూన్ 4న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగుతాయి.
అదేవిధంగా, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరిమాణిక్యస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు మే 27 నుండి జూన్ 5వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో ప్రధానంగా మే 27న ధ్వజారోహణం, మే 29న గరుడసేవ, జూన్ 1న కల్యాణోత్సవం, జూన్ 2న రథోత్సవం, జూన్ 4న ధ్వజావరోహణం, జూన్ 5న పుష్పయాగం నిర్వహిస్తారు.
Source