శ్రీ పెద్దజీయర్‌స్వామివారు ఈ ఆలయానికి ఆధ్యాత్మికపెద్దగా వ్యవహరిస్తున్నారు. శ్రీపెద్దజీయర్‌స్వామివారి కోరిక మేరకు 2010వ సంవత్సరం నుండి ఈ ఆలయ బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని టిటిడి శ్రీవారి కానుకగా పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.

ముందుగా తిరునిన్రవూరులోని శ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠానికి టిటిడి ఈవో చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ భక్తవత్సల పెరుమాళ్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాల సందర్భంగా ఎనిమిదేళ్లుగా టిటిడి నుంచి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్టు తెలిపారు.

తిరు అనగా ‘శ్రీ లక్ష్మీ’ అని, నిన్ర అనగా ‘నిలబడి’ అని, వూరు అనగా ‘ప్రదేశం’ అని అర్థమని, శ్రీలక్ష్మీదేవి నిలబడి ఉన్న ప్రదేశంగా తిరునిన్రవూరు గుర్తింపు పొందిందని వివరించారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం ఒకటి అని చెప్పారు.
Source