ఏప్రిల్‌ 7 నుండి 12వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ ఏప్రిల్‌ 7 నుండి 12వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏప్రిల్‌ 7వ తేదీ శనివారం రాత్రి 7.30 గంటలకు అంకురార్పణం జరుగనుంది.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాలలో జీర్ణోద్ధరణ (ఆధునీకరణ పనులు) గత సంవత్సరం డిసెంబరులో చేెపట్టిన విషయం విధితమే.

ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలోని ద్వారపాలకులు, గరుడాళ్వారు, ధ్వజస్తంభం, ఎదురు ఆంజనేయస్వామివారు, భాష్యకార్లు, కూరత్తాళ్వార్‌, మధురకవి ఆళ్వార్‌, మొదలియాండన్‌ ఆలయాల మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఏప్రిల్‌ 7న నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట


ఏప్రిల్‌ 7వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు ఆలయంలో నూతన ధ్వజస్తంభంను శాస్త్రోక్తంగా ప్రతిష్టించనున్నారు.

Source