Ontimitta - రాముని చెంత కనిపించని హనుమంతుడు-ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం

Ontimitta Kodanda Ramalayam


ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం అతి ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ శ్రీరాముని చెంత ఆయన నమ్మినబంటు హనుమంతుడు కనిపించడు.

ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఒక మండలము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఈ ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రం ఏకశిలానగరంగా కూడా ప్రసిద్ధి చెందింది.

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని భద్రాచలం దేవస్థానం స్థాయిలో తీర్చిదిద్దాలని , శ్రీరామనవమి వేడుకలను అక్కడే అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తోంది. ఈ కోదండరామాలయ విశేషాలు తెలుసుకుందాం.

https://youtu.be/mSnTYIrarcI