ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.00 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన ఈ స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ, తాము కూడా రథాన్ని లాగారు.
శ్రీవారి వసంతోత్సవాలలో భాగంగా రెండవరోజు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మూడవరోజైన మార్చి 31వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
వసంత్సోవ వేడుకలను పురస్కరించుకొని మార్చి 31వ తేది శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి వేంచేపుచేశారు. అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కాగా మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
పౌర్ణమి గరుడుసేవ రద్దు
ఈ నెల 31వ తేది శనివారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకొని టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
Source