వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 5.00 గంటల నుండి 5.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.30 గంటల వరకు అశ్వవాహనంపై శ్రీకోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేశారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాది రూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి, తరించమని ప్రబోధిస్తున్నాడు.
ఏప్రిల్ 2న చక్రస్నానం
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది.
సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.
ఏప్రిల్ 3న పుష్పయాగం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
Source