ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు.
త్రేతాయుగంలో లక్ష్మణుడుగా,ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి
సాంస్కృతిక కార్యక్రమాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీమతి అన్నపూర్ణ రామాయణంలో సోదరవాత్సల్యంపై ధార్మికోపన్యాసం, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శ్రీ ఎం.రవిచంద్ర బృందం భక్తి సంగీతం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీమతి కె.ప్రమీల శ్రీ సీతారాముల కల్యాణం హరికథ కార్యక్రమాలు నిర్వహించారు.
Source