
అనంతరం శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్ దీక్షితులు ఏనుగుపై ముత్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
1984వ సంవత్సరం నుండి టిటిడి పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలను శ్రీకోదండరామాలయానికి తీసుకువెళ్ళడం ఆచారంగా వస్తోంది. సాయంత్రం సీతారామస్వామి వారి కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. అ నంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారని చెప్పారు. మార్చి 27న మంగళవారం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు రామాలయంలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.
Source