టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా విళంబినామ ఉగాది వేడుకలు

తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ఆదివారం విళంబినామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…


తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ ముఖ మండపంలో స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పుష్పపల్లకీ సేవ నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరుగనుంది.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, అర్చన నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.00 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరుగనుంది.

asthanam

శ్రీ కోదండరామాలయంలో..


తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మూెత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేస్తారు.

శ్రీ కపిలేశ్వరాలయంలో..


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ఉగాది సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.

Source