శివరాత్రినాడు పరమేశ్వరునికి చేయాల్సిన అభిషేకాల గురించి తెలుసుకోండి


చాంద్రమానం ప్రకారం ప్రతినెలా వచ్చే 14వ రోజు అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజును శివరాత్రి అంటాము. మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అంటాం. ఈ ప్రత్యేకమైన రోజున వ్యవస్థలో శక్తి ఉప్పొంగేందుకు ప్రకృతి సహకరిస్తుంది. ఈ రోజున మానవ చైతన్యం ఉప్పొంగుతుంది.

జగత్తులో శక్తి విస్తరణ జరుగుతుంది. ప్రస్తుతం తాము ఉన్నదాని కంటే మరికొంచెం ఎదగాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రోజు శివునికి చేసే పూజలు అభిషేకాలు మహా ప్రశస్తమైనవి. ఈ మహత్తరమైన రోజున అంటే శివరాత్రినాడు శివుడికి ఏ అభిషేకం చేస్తే ఏ ఫలితం దక్కుతుంది ఈ మీడియోలో చూద్దాం.

పరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన పరమ పవిత్రదినం మహాశివరాత్రి. మాఘ బహుళ చతుర్దశినాడు అంటే శివరాత్రినాడు పరమేశ్వరుడు రాత్రి 12 గంటల ప్రాంతంలో జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించాడు. అందువల్ల ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పరమేశ్వరునికి అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడిని పంచామృతాలతో అభిషేకిస్తే చాలు ఆయన కటాక్షానికి పాత్రులవుతాం. పాలతో అభిషేకించినా భోళాశంకరుడు కరుణిస్తాడు. కనీసం జలంతో అభిషేకం చేసినా శివుడు భక్తవశంకరుడు అవుతాడు.


శివరాత్రినాడు పరమేశ్వరుని షోడశ ఉపచార యుక్తంగా అభిషేకించండిలా...


శివరాత్రి రోజు అర్చన, అభిషేకంతో సదాశివుడి అనుగ్రహం పొందితే జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజున కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివ సానిధ్యాన్ని చేరుకుంటారు.



అనేక రకాల పుష్పాలతో అభిషేకం చేస్తే రాజభోగాలు, వెండిధూళి లేదా వెండి రజనుతో శివుడిని అభిషేకిస్తే విద్యాప్రాప్తి కలుగుతాయి. నవధాన్యాలతో అభిషేకిస్తే ధనంతోపాటు భార్యాపుత్రలాభం కలుగుతుంది. పటికబెల్లంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకం చేస్తే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదాభిషేకంతో చేసే అభిషకం వల్ల మనకు సర్వకార్యాలు ప్రాప్తిస్తాయి.

బెల్లంతో...


బెల్లంతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వెదురు చిగుళ్లతో అభిషేకం చేస్తే వంశవృద్ధి కలుగుతుంది. పాలతో అభిషేకిస్తే కీర్తి, సిరి సంపదలు, సుఖాలు కలుగుతాయి. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో లింగాభిషేకం చేస్తే దారిద్ర్యనాశనమవుతుంది. ఇక వివిధ రకాల పండ్లతో చేసే అభిషేకం వల్ల జయం కలుతుంది.

ఉసిరికాయలతో...


ఉసిరికాయలతో చేస్తే మోక్షం లభిస్తుంది. సువర్ణం పొడిగా చేసి అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వల్ల సిద్ధి కలుగుతుంది. మణులు, వాటి పొడులతో అభిషేకిస్తే మనలోని అహంకారం తొలగిపోతుంది. పాదరసంతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఆవు నెయ్యి, పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయు:వృద్ధి కలుగుతుందని మన పురాణాలు పేర్కొంటున్నాయి.