మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • మార్చి 1న కుమారధార తీర్థ ముక్కోటి, హోలీ పండుగ.

  • మార్చి 3న శ్రీ లక్ష్మీ జయంతి.

  • మార్చి 14న శ్రీతాళ్ళపాక అన్నమాచార్య 515వ వర్థంతి,

  • మార్చి 15న మాసశివరాత్రి.

  • మార్చి 17న సర్వ అమావాస్య.

  • మార్చి 18న శ్రీ విళంబి నామా సంవత్సర ఉగాది ఆస్థానం.

  • మార్చి 20న మత్స్య జయంతి.

  • మార్చి 25న శ్రీ రామనవమి.

  • మార్చి 26న ధర్మరాజ దశమి, తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరాముల వారి పట్టాభిషేక ఆస్థానం.

  • మార్చి 27న సర్వ ఏకాదశి.

  • మార్చి 29 నుండి 31వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు.

  • మార్చి 31న తుంబూరుతీర్థ ముక్కోటి.


Source