- మార్చి 1న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తారు.
- మార్చి 2, 9, 16వ తేదీల్లో శుక్రవారం నాడు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
- మార్చి 3న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
- మార్చి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
- మార్చి 14న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
- మార్చి 18న ఉగాది రోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి సాయంత్రం 5.30 నుంచి 7.00 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.
- మార్చి 23న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిస్తారు.
Source