తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి వెండి సింహాసనాన్ని టిటిడి తయారుచేయించి అందజేసింది. టేకు కొయ్యతో రూపొందించిన ఆకృతిపై వెండి రేకులను అమర్చి సింహాసనాన్ని రూపొందించారు. ఇందుకోసం రూ.53 లక్షలు విలువైన 127.450 కిలోల వెండిని వినియోగించారు.
తిరుపతిలోని పాత హుజుర్ ఆఫీసు ప్రాంగణంలో గల జ్యువెలరీ విభాగంలో తయారుచేసిన ఈ సింహాసనాన్ని సాయంత్రం ఆలయానికి తీసుకొచ్చి అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీ రామ పట్టాభిషేకం ఉత్సవాల్లో ఈ సింహాసనాన్ని వినియోగిస్తారు.
Source