శ్రీ‌క‌పిలేశ్వ‌రాల‌యంలో సింహ వాహనం

తిరుప‌తిలోని శ్రీ కపిలేశ్వ‌రాల‌యంలో మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది.

kapileswara swamy

ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్ర మృగాల భయం ఉండదు. సింహవాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులంతా పునీతులయ్యారు.

Source