ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు తుమ్మూరు శ్రీ కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీ గంగా కామాక్షీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

బ్రహ్మోత్సవాలకు ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు



  • 11-02-2018 ఆదివారంఉదయం  ధ్వజారోహణం(8.07గం||లకు), సాయంత్రం శేష వాహనం

  • 12-02-2018 సోమవారం ఉదయం  చప్పర ఉత్సవం ,సాయంత్రం రావణ వాహనం

  • 13-02-2018 మంగళవారం ఉదయం చప్పర ఉత్సవం, నంది, హంసవాహనం

  • 14-02-2018 బుధవారం ఉదయం చప్పర ఉత్సవం గజవాహనం, సాయంత్రం సింహవాహనం అనంతరం కల్యాణోత్సవం

  • 15-02-2018 గురువారం ఉదయం చప్పర ఉత్సవం, సాయంత్రం ధ్వజావరోహణం

  • 16-02-2018(శుక్రవారం)  సాయంత్రం  ఏకాంతసేవ


Source