బ్రహ్మూెత్సవాల్లో శ్రీవారు స్వయంగా ఊరేగింపులో పాల్గొనే మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు.
శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తారు.