తెప్పపై శ్రీభూ సమేత మలయప్పస్వామివారి కటాక్షం

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు.

malayappa swamy in teppa

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.

కాగా, చివరి రెండు రోజులు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తెప్పపై భక్తులకు దర్శనమిస్తారు.

Source