Shat Tila Ekadasi- షట్ తిల ఏకాదశి అంటే ఏమిటి? ఆరోజు ఏంచేయాలి?


తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. శ్రీమన్నారామణునికి , పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తున్నది. షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో ఆరు కార్యక్రమాలు చేయడమే ఈ రోజు ప్రత్యేక విధి అన్నమాట.

షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన ఆరు తిల విధులు

  • తిలాస్నానం - నువ్వుల నూనె వంటికి రాసుకుని , నువ్వులతో స్నానం చేయాలి.  నువ్వులు నెత్తిమీద నుండి కిందకు పడేలా స్నానం చేయాలి.
  • తిల లేపనం – స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి రాసుకొవాలి.
  • తిల హోమం- చేయడానికి వీలున్న వాళ్లు తిల హోమం నిర్వహించాలి.
  • తిలోదకాలు – పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట . నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం పళ్లెంలో నీళ్లతో వదలడం.
  • తిలదానం - నువ్వులు కానీ , నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి.
  • తిలాన్నభోజనం – నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది). ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట.  ఈ పరిహరాలు పాటిస్తే పితృ శాపం తొలగిపోయి వెంటనే మనస్సులోని కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు.