తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం స్వామివారు ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 6.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేస్తారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Source