జనవరి 31న చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు

చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీన రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. విఐపి బ్రేక్‌ దర్శనాన్ని ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది.

జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుంది. ఈ కారణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివుంచుతారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని కూడా మూసివేస్తారు. అన్నప్రసాదాల వితరణ లేని కారణంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోకి భక్తులకు అనుమతి ఉండదు.

ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా టిటిడి రద్దు చేసింది. శ్రీవారి ఆలయం ఉదయం, రాత్రి కలిపి దాదాపు 5 గంటల పాటు మాత్రమే తెరిచి ఉంటుందని, భక్తులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తమ తిరుమల యాత్రను సాగించాలని టిటిడి కోరుతోంది.

Source