
మంగళవారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీ మలయప్పస్వామివారు వెండి తిరుచ్చిలో, శ్రీ కృష్ణస్వామివారు మరో తిరుచ్చిలో పార్వేట మండపమునకు చేరుకున్నారు. అనంతరం శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేటిలో ఉత్సహంగా పాల్గొన్నారు.
శ్రీ మలయప్పస్వామివారి తరపున అర్చకులు 3 సార్లు బాణం, ఈటె వేసి మాదిరి వేటను ప్రదర్శించి, భక్తులకు కనువిందు చేశారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది.
Source