కొత్తపేట, రావులపాలెం, ఉప్పలగుప్తం, అవిడి, కాట్రేనికోన, తొండవరం, అంబాజీపేట మండలాల్లో ప్రధాన ఉత్సవాలు జరుగుతాయి. వీటన్నింటిలో ప్రధానంగా జగ్గన్నతోటలో జరిగే ప్రభలతీర్థం అతి ప్రముఖమైనది,అత్యంత ప్రాచీనమైనది కూడా. ఈ ప్రాంత ఉత్సవానికి సుమారు 400 సంవత్సరాలకు పైబడ్డ చరిత్ర వుందని చెబుతారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ ప్రభత తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభల తీర్థం పూర్వాపరాలు మీకోసం...
[gallery size="full" ids="1047,1046,1045"]
ఉత్సవాల నిర్వచనం...
వెదురుకర్రలతో కూర్చిన ఆర్చీల వంటి నిర్మాణాకు నూతన వస్త్రాలను అలంకరించి ఈ ప్రభలను తయారుచేస్తారు. ఈ ప్రభల తయారీని కనసీమలోని ప్రతీ గ్రామం వారూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. పోటా పోటీగా ఈ ప్రభలను ఎత్తుగాను, ఎంతో అందంగా తయారుచేస్తారు. ఈ ప్రభలలో శివుని ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. తరువాత ఆ ప్రభలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఒకచోట కొలువు దీర్చి, వాటినిభక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
ప్రభల తీర్థం సన్నాహాలు ప్రభను తయారుచేసేందుకు ముహూర్తం నిర్ణయించడంతో ప్రారంభం అవుతాయి. సంప్రదాయంగా ఒకే వంశానికి చెందినవారు ప్రభను తయారుచేస్తారు. వాటిని పువ్వులతోనూ, రంగు రంగుల కాగితాలతోనూ అలంకరిస్తారు. ప్రభల తయారీలో, ప్రభల అలంకరణలో ఉళ్ళన్నీ ఉత్సాహంగా పాలు పంచుకుంటారు.
[gallery size="full" ids="1037,1044,1036"]
ఉత్సవాలకున్న చారిత్రక గాధ
ప్రభల తీర్థం వెనుక ఒక ఆసక్తికరమైన చారిత్రక గాధ దాగి ఉంది. పూర్వం కోనసీమ ప్రాంతంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు అన్ని గ్రామాల్లోని రుద్రులు ఒకచోట సమావేశమై లోక రక్షణ గావించారనీ, అప్పటినుండీ ఈ కనుమ రోజున అన్ని గ్రామాల్లోని ప్రజలు ప్రభలను రుద్రులుగా భావించి పూజించి వారిని ఒకేచోట సమావేశపరచడం ఆనవాయితీగా వస్తోంది.
[gallery size="full" ids="1039,1040,1035"]
ఏకాదశ రుద్రుల ప్రాశస్త్యం
అంబాజీపేట మండలం, మొసలపల్లి గ్రామం లోని జగ్గన్న తోటలో జరిగే ఈ తీర్థంలో ఏకాదశ రుద్రులు అంటే 11 మంది రుద్రులు 11 గ్రామాల నుంచి వచ్చి పాలుపంచుకుంటారు. ఆ గ్రామాలు మొసలపల్లి, పెదపూడి,పుల్లేటి కుర్రు, ముక్కామల,ఇరుసుమండ, నేదునూరు, వక్కలంక, వ్యాఘ్రేశ్వరం, పాలగుమ్మి, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం. ఈ గ్రామాల ప్రభలన్నీ తోటల్లోనుండీ, పొలాల్లోనుండీ జగ్గన్నతోటకు వస్తాయి. అలా దేవుడు తమ పొలాలను తొక్కుతూ వస్తే తమకు మంచి జరుగుతుందనేది రైతుల నమ్మకం. మరొక ఒళ్ళు గగుర్పొడిచే, ఆనందంతో పులకరించే సంఘటన గంగలకుర్రు, అగ్రహారం ప్రభలను గోదావరి నది పాయల్లో ఒకటైన కౌశిక లోనుండి తీసుకు రావడం మరలా తిరిగి సాయంకాలం తీసుకువెళ్లడం. నదిలోతుల్లో నుంచి ప్రభలను తీసుకు వచ్చే సన్నివేశం, పోలాల గట్ల నుంచి తరలించే సన్నివేశాలు సందర్శకులను ఆద్యాత్మిక భావోద్వేగానికి గురి చేసాయి. ప్రలంతా పరమేశ్వరుని యెడల భక్త ప్రపత్తులతో పులకరించి పోతారు. ఈ రుద్రుల సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చేది మొసలపల్లి ఈశ్వరుడు కాగా, వ్యాఘ్రేశ్వరుడు అధ్యక్షత వహిస్తాడు.
[gallery columns="2" size="full" ids="1042,1041"]
పెళ్లిచూపుల వేదిక కూడా...
కేవలం భక్తికే కాకుండా ఇది సామాజి ఐక్యతను చాలిచెప్పే చక్కని వేడుక ప్రభల తీర్థం. రాష్ట్రం నలుమూలల నుండి బంధువులు, స్నేహితులు వచ్చి ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. పెళ్లి సంబంధాలకు ఇది చక్కని వేడుకైన వేదిక కూడా.
ఈ ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలివే...
- వ్యాఘ్రేశ్వరం-శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి
(బాలాత్రిపురసుందరీ) - పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి
(బాలా త్రిపుర సుందరి) - మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి
- గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు
- గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు
- పెదపూడి-మేనకేశ్వరుడు
- ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు
- వక్కలంక-విశ్వేశ్వరుడు
- నేదునూరు–చెన్న మల్లేశ్వరుడు
- ముక్కామల-రాఘవేశ్వరుడు
- పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు