సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకోవడం ద్వారా సనాతన భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకోవచ్చు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు గోవు మహత్యాన్ని తెలియచేసారు.
గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. పూర్వకాలం నుండి కనుమ పండుగ రోజున గోపూజకు చాల ప్రాధాన్యత ఉంది. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుంది.
దేశవాళీ గోవులను అభివృద్ధి చేసి, వాటి పంచగవ్యఉత్పత్తుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు టిటిడి కృషిచేస్తంది. పంచగవ్య ఉత్పత్తుల ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవచ్చు. గోవును పూజిస్తే సకల దేవతల పూజాఫలం లభిస్తుంది. ఆవు
నుండి లభించే పంచగవ్యాల్లో ఏన్నో ఔషధ గుణాలున్నాయి. గోశాలల నిర్వహణ ద్వారా గోసంరక్షణ, గో ఆభివృద్ధికి టిటిడి కృషి చేస్తోంది. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆదర్శ గో శాలలకు ఆర్ధిక సాయం అందించేందుకు టిటిడి చర్యలు తీసుకుంటోంది.
వేదాల నుండి గోమాత ఉద్భవించినందున భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశిష్టమైన స్థానం ఉంది. గోవు తల్లి లాంటిది. గోవును పుజిస్తే తల్లిదండ్రులు, గురువును పూజించినట్లే. గోవు సంతానమైన ఎద్దు పాడిపంటలు పండిచడానికి, రైతులకు అండగా ఉంటుంది.
గోపూజకు ముందు టిటిడి ఈఓ గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజ జరిగాయి. అటుతర్వాత గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, విశ్వం టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు, పురప్రజలను ఆకట్టుకున్నాయి.
Source