రెండోసారి పీఠాన్ని అధిష్టించిన శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థస్వామి
ఉడిపిలో 800 ఏళ్లనాటి పురాతన ప్రాశస్త్యం గల శ్రీకృష్ణస్వామివారి ఆలయం ఉంది. ద్వైత సంప్రదాయాన్ని పాటిస్తున్న అష్ట మఠాల పీఠాధిపతులు ఒక్కొక్కరు రెండేళ్ల చొప్పున ఈ ఆలయ నిర్వహణతోపాటు పూజాకైంకర్యాల బాధ్యతను నిర్వహిస్తారు. ఈ బాధ్యతలను స్వీకరించే కార్యక్రమాన్ని ”పర్యాయ ఉత్సవం”గా వ్యవహరిస్తారు. దీనిని ”సర్వజ్ఞ ఉత్సవం” అని కూడా అంటారు. పెజావర్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వేశతీర్థస్వామివారి నుంచి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామివారు బాధ్యతలు స్వీకరించారు.
Source