గొబ్బిళ్ళ పాటలు-05: చుంచు దువ్వి పింఛం చుట్టెద గోపాల కృష్ణ



సంక్రాంతి సంబరాల్లో భాగమైన గొబ్బిళ్ళ పండుగలో పాడుకును గొబ్బిళ్ల పాటలు మీ కోసం శ్రీసన్నిధి అందిస్తోంది.ఈ వీడియోలో ‘చుంచు దువ్వి పింఛం చుట్టెద  గోపాలకృష్ణ’ అనేపాట అందిస్తున్నాము

సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు శ్రీసన్నిధి అందిస్తోంది. ఈ వీడియోలో ‘చుంచు దువ్వి పింఛం చుట్టెద  గోపాలకృష్ణ’అనే పాటను మీకు 6వ పాటగా అందిస్తున్నాము.

చుంచుదువ్వి పింఛం చుట్టెద -
గొపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా

చుంచుదువ్వి పింఛం చుట్టి - పంచదార పాలు పోసి
ఎంచరాని బోజ్జలోవేడి బువ్వపెట్టి బజ్జొపెడుదు ||
చుంచుదువ్వి - చుంచుదువ్వి

చుంచుదువ్వి పింఛం చుట్టెద -
గొపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా

కాళ్ళకు గజ్జెలు కట్టెద - గొపాలకృష్ణ
మెళ్ళోను హారం వేసెద
కాళ్ళాకు గజ్జెలు కట్టి - మెళ్ళోన్ను హారం వెసి
ఒళ్ళోను పప్పులు పోసి పిల్లనగ్రోవి చేతికిచ్చెద
చుంచుదువ్వి - చుంచుదువ్వి

చుంచుదువ్వి పింఛం చుట్టెద -
గొపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా

బోజ్జకు పసిడి గజ్జెలు కట్టెద - గొపాలకృష్ణ
బుజ్జి భుజములు తిప్పి ఆడరా
బోజ్జకు పసిడి గజ్జెలు కట్టి - బుజ్జి భుజములు తిప్పి ఆడి
బంగరు తొట్టె నామదిలోనా బాలకృష్ణ నిద్దురపోరా ||
చుంచుదువ్వి - చుంచుదువ్వి

చుంచుదువ్వి పింఛం చుట్టెద -
గొపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా