సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు భక్తిసారం అందిస్తోంది. ఈ వీడియోలో ‘అటవీ స్థలములకరుగుదమా, సుబ్బీ గొబ్బెమ్మా’అనే పాటలు మీకు అందిస్తున్నాము.
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
చింతాపిక్కాలాడుదమా సిరి సిరి నవ్వులు నవ్వుదమా
చింతాపిక్కాలాడుదమా సిరి సిరి నవ్వులు నవ్వుదమా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
గుంటలు గుంటలు త్రవ్వుదమా చెలి గోళీకాయాలాడుదమా
గుంటలు గుంటలు త్రవ్వుదమా చెలి గోళీకాయాలాడుదమా
అటవీస్థలములకరుగుదమా చెలి వటపత్రంబులు కోయుదమా
సన్నాజాజులు కోయుదమా దండలు దండలు గుచ్చుదమా
సన్నాజాజులు కోయుదమా దండలు దండలు గుచ్చుదమా
స్వామి మెడలో వేయుదమా
స్వామి మెడలో వేయుదమా
స్వామి మెడలో వేయుదమా
--------------------------------
సుబ్బి గొబ్బెమ్మా సుబ్బణ్ణియ్యావే
సుబ్బి గొబ్బెమ్మా సుబ్బణ్ణియ్యావే
చేమంతి పువ్వంటీ చెల్లెల్నియ్యావే
తామర పువ్వంటీ తమ్ముణ్ణియ్యావే
అరటిపువ్వంటీ అత్తానియ్యావే
మందారపువ్వంటీ మామానియ్యావే
బంతిపువ్వంటి బావనియ్యావే
గుమ్మడిపువ్వంటీ గుమ్మణ్ణియ్యావే
కమలంపువ్వంటీ కోడల్నియ్యావే
మొగిలిపువ్వంటీ మొగుణ్ణియ్యావే