తమిళనాడు రాష్ట్రం నంగునేరిలోని శ్రీ వానమామలై మఠాధిపతి శ్రీమత్ పరమహంస ఇత్యాది మధురకవి వానమామలై రామానుజ జీయర్‌స్వామివారు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీ వానమామలై మఠానికి 31వ మఠాధిపతిగా శ్రీమత్ పరమహంస ఇత్యాది మధురకవి వానమామలై రామానుజ జీయర్‌స్వామివారు కొనసాగుతున్నారు.