ధనుర్ధమాసం : నుర్మాసంలో దైవాన్ని ఆరాధించండిలా


ధనుర్మాసంలో ప్రతి రోజు సూర్యోద యానికంటే ఐదు ఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసు కుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యా వందనాన్ని ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషే కిస్తే తమ కుటుంబం సుఖ సంతో షాలతో ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణు గాథలను చదువుతూ గానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శిం చడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులు, 8 రోజులు, 6 రోజులు, 4 రోజులు, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్ఠతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుస్తారని మన పురాణాలు తెలుపుతున్నాయి.

కాత్యాయనీ వ్రతం

కాత్యాయనీ వ్రతాన్ని ఈ ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్ప బడుతోంది. పూర్వం
ఈ వ్రతాన్ని స్వయంగాఇచ్చిన శ్రీకృష్ణుని సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణునే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగ నాథుని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్ల డిస్తున్నాయి. ఈ వ్రత విధానం ధను ర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్క రించాలి. అనంతరం కాత్యాయనీ దేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరిస్తారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవం మహా ఘనంగా జరుగుతుంది. తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని ''పావై నొంబు'' అంటారు.

తిరుప్పావైతో తరించండి

రంగనాథస్వామికి మనసిచ్చిన గోదాదేవి ఆ స్వామిపై పాశురాలను రచించింది. ఈ నెలరోజుల పాటు ఆ పాశురాలను ''తిరుప్పావై''గా స్వామివారి సన్నిధిలో గానం చేయడం జరుగుతూ ఉంటుంది. 'ఆండాళ్' పేరుతో గోదా దేవిని భక్తులు కొలుస్తుంటారు.  లక్ష్మీదేవి అంశతో అవతరిం చినదిగా చెప్పబడుతోన్న గోదాదేవి, మధుర భక్తికి నిలువెత్తు నిర్వచనం లా కనిపిస్తూ ఉంటుంది. రంగనాథ స్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆమె ఆయనని భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ధనుర్మాసంలో స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంది. అదేవిధంగా కోరిన కోర్కెలు తీరడానికి భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువును పూజించాలి.

అసమానమైన ప్రేమతో స్వామి వారికి పూల మాలికలు అల్లి ఆయన మనసు గెలుచుకుంటుంది. తాను కలలు కన్నట్టుగానే రంగనాథ స్వామిని వివాహమాడుతుంది. ఈ కారణంగా స్వామివారి క్షేత్రాల్లో ఆయన సన్నిధానంలో గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఎల్లెడలా భక్తులతో పూజలు అందుకుంటూ ఉంటుంది.
రంగనాథస్వామి పట్ల గోదా దేవికి గల ప్రేమ, భక్తి, విశ్వాసాలను ఆవిష్కరిస్తూ మరింత విశేషాన్ని సంతరించుకున్నదిగా ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు. ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేంకటేశ్వరుని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.