భగవంతునికి నివేదించే నైవేద్యాల విషయంలో రెండు రకాల నమ్మకాలను మని కలిగి ఉంటాం. అందులో మొదటిది బలమైనది దేవునికి నివేదించే పదార్థాలు ఆ భగవంతునికి ఇష్టమైనవై ఉంటాయి. రెండు కాలానుగుణంగా వచ్చే వాతావరణ మార్పులకు అనుగుంణంగా ఆరోగ్యవంతమైన పదార్ధాలను భగవంతునికి సమర్పించడం. లోక కళ్యాణమే భగవదేచ్చ కాబట్టి, భగవంతుడు కూడా ఇదే కోరుకుంటాడంటారు పెద్దలు.
ఆయా మాసాల్లో పెట్టే నైవేద్యాలకు ఒక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. సంబంధిత మాసాల్లో కాలంలో ఏర్పడే మార్పులను అనుగుణంగా ఆరోగ్య రక్షా సూత్రాల ప్రకారం పురాణ కాలంలోనే మన పూర్వీకులు భగవంతునికి నివేదించాల్సిన నైవేద్యాలను కూడా నిర్ధారించారు. భగవంతునికి నివేదించే నైవేద్యం మనం కూడా భుజిస్తాం అందుకే భగవద్ నిర్దేశం ప్రకారమే పురాణాల్లో నైవేద్యాలలో కాలానుగుణంగా పెట్టే నైవేద్యాలను కూడా నిర్ధారించారని పెద్దలు చెబుతున్నారు.
ధనుర్మాస కాలం చలికాలం, ప్రతిచోటా శీతల గాలులు వీస్తుంటాయి. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పులలో చలువ చేసే గుణం ఉన్నందువలన భగవంతుని ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.
అందుకే ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం, పాయసం, దధ్యోదనం సమర్పించాలి.