తిరుమలకు విచ్చేసే భక్తులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనార్థం కల్పించేందుకు ఉద్దేశించిన సమయ నిర్దేశిత సర్వదర్శనం(టైమ్‌స్లాట్) విధానాన్ని టిటిడి సిబ్బంది సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని తిరుమల జెఈవో కోరారు.
టిటిడి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానానికి సంబంధించి డిసెంబరు 18 నుంచి 23వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా టోకెన్లు మంజూరుచేస్తారు. భక్తులు ఆధార్ కార్డులను చూపి సర్వదర్శనం టోకెన్లు పొందాలి.
ఇందుకుగాను తిరుమలలోని 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లను ఏర్పాటుచేసారు. 25 కౌంటర్లలో త్రిలోక్ సిబ్బంది, గాలిగోపురం వద్ద 12 కౌంటర్లు, శ్రీవారిమెట్టు వద్ద 4 కౌంటర్లలో బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది, మిగిలిన కౌంటర్లలో టిటిడి సిబ్బంది టోకెన్లు మంజూరు చేస్తారు.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు సిబ్బందికి మూడు షిప్టుల్లో విధులు కేటాయిస్తారు. తిరుపతి నుంచి సిబ్బంది తిరుమలకు చేరేందుకు టిటిడి పరిపాలనా భవనం నుంచి రవాణా ఏర్పాట్లు చేశారు.
Source